Header Banner

లోకేష్ మీడియా సమావేశం.. అహంకారానికి ఫ్యాంటు, షర్టు వేస్తే జగన్! అవినీతి చేయలేదని తన బిడ్డలపై..

  Wed Mar 05, 2025 17:35        Politics

మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం.. అహంకారానికి ఫ్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుంది. అధికారంలో ఉన్నా, కోల్పోయినా ప్రజలకు దూరంగానే ఉన్నారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయట.. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించారు. ఆ విషయం జగన్‌కు ఎందుకు అర్ధం కావట్లేదు. తల్లి, చెల్లి కూడా నమ్మట్లేదని జగన్ ఇంకా గ్రహించట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత జగన్‌కు భయం పట్టుకుంది. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి సీఎంను కించపరిచేలా మాట్లాడుతారా? 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. చట్టం ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? చట్టాలను ఉల్లంఘించడం జగన్‌కు బాగా అలవాటు.. జగన్ అసెంబ్లీకి రావాలి.. వారికి కేటాయించిన సమయం ప్రకారం స్పీకర్ మైక్ ఇస్తారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంటుంది. పవన్ కల్యాణ్‌కు వచ్చిన మెజారిటీ ఎంత?.. జగన్‌కు వచ్చింది ఎంత?  సీఎం, డిప్యూటీ సీఎంపై జగన్‌వి దిగజారుడు మాటలు.. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడాలి.. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడుల ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. గతంలో లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

గతంలో అమరావతి, పోలవరం పనులను ఎందుకు ఆపారు? గత ప్రభుత్వ విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది. గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెడుతున్నాం.. అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించింది. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ జరుగుతుందని ఎన్నికల ముందు చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్నాం. మద్యంలో అవినీతి చేయలేదని తన బిడ్డలపై జగన్ ప్రమాణం చేయాలి.. ఐదేళ్లు ఒక్క డీఎస్సీ వేయని జగన్‌కు దానిపై మాట్లాడే హక్కు ఎక్కడిది? సూపర్-6లో మెజార్టీ హామీలు 9 నెలల్లోనే అమలు చేశాం.. మిగిలినవి ఓ క్రమపద్ధతిలో అమలు చేస్తూ వస్తున్నాం. దశలవారీగా అన్ని హామీలు అమలు చేసి తీరుతాం. ఇచ్చిన ఒక్కో హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. అధికారంలోకి వచ్చాక టెట్ నిర్వహించాం. కమిషన్ నివేదిక వచ్చాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. అనంతరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ప్రతినెలా లబ్ధిదారులకు పింఛన్ విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం అని తెలియజేసిన మంత్రి నారా లోకేష్.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #LokeshSpeech #jagan #comments #viralvideo #lokeshmeeting #ycp #tdp